Kiran Abbavaram: సినిమా ప్రచారాన్నివరైటీగా చేస్తేనే ఆడియన్స్ లోకి వెళుతుంది. అదే పంథాను ఫాలో అవుతోంది ‘క’ టీమ్. దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని ఎంతో భిన్నంగా తెలియచేశాడు ఆ సినిమా హీరో కిరణ్ అబ్బవరం. తన పెట్ డాగ్ తీసుకుని వచ్చిన లెటర్ ని చూస్తున్న కిరణ్ ని ఏంటి ఆ లెటర్ అని హీరోయిన్ నయన సారిక అడగ్గా… ‘మన మూవీ సెన్సార్ అయిపోయింది క్లీన్ యు’ అని చెప్పటం… అలాగే సినిమా లెంగ్త్ కూడా 231 అని వివరించటం ఆకట్టుకుంది. ఇటీవల సినిమాలను దాదాపు 3గంటల పాటు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని తమ సినిమా అంత ఉండదని క్రియేటీవ్ గా చెప్పారు దర్శక ద్వయం సుజీత్-సందీప్. తన్వీరామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీకి శ్యామ్.సి.ఎస్ సంగీతాన్ని అందించారు. శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ పై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ మూవీ 31న రిలీజ్ కానుంది. మరి కిరణ్ అబ్బవరంకు ఈ సినిమా ఎలాంటి విజయన్ని కట్టబెడుతుందో చూడాలి.