Krishnam Raju Arrested

Krishnam Raju Arrested: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్‌

Krishnam Raju Arrested: అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురైన సీనియర్ జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చివరకు పోలీసులకు చిక్కారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయనను పోలీసులు విశాఖపట్నం సమీపంలోని భీమిలి వద్ద, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. అదేవిధంగా, అతనితో ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణంరాజు ఈ మధ్య ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని “అమరావతి దేవతల రాజధాని కాదు… వేశ్యల రాజధాని” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మహిళా సంఘాలు, పౌరసంఘాలు, జర్నలిస్టు సంఘాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కి పలువురు ఫిర్యాదులు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ వ్యవహారంలో చర్చా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా విమర్శలకు గురయ్యారు. ఆయనను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇది కూడా చదవండి: Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఈఈ శ్రీధర్‌కు రూ.200 కోట్లకు పైగా ఆస్తులు 

ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న కృష్ణంరాజు అజ్ఞాతంలో నుంచే ఓ వీడియో రిలీజ్ చేస్తూ తన వ్యాఖ్యలకు సమర్థనగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులపై వ్యంగ్యంగా స్పందించిన కృష్ణంరాజు, తనను అణచివేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్‌ను జూన్ 12న హైకోర్టు విచారించనుండగా… అప్పటికే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారి కృషితోనే కృష్ణంరాజు ఎట్టకేలకు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం మంగళగిరి కోర్టులో ఆయనను హాజరు పరచనున్నట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Indian Racing League 2024: ఎఫ్‌4 ఛాంపియన్‌ అకీల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *