Singer Mangli

Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత..

Singer Mangli: తెలంగాణ ఫోక్ పాటలంటే ముందుగా గుర్తొచ్చే పేరే మంగ్లీ. బతుకమ్మ, బోనాలు, శివరాత్రి పాటలతో ప్రజల మనసు దోచుకున్న ఈ గాయని, పల్లెటూరి సౌరభాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వారు. టీవీ యాంకరింగ్ నుంచి సంగీత ప్రపంచానికి దూసుకొచ్చిన మంగ్లీ, ఇప్పుడు సినిమా పాటలతోనూ, స్టేజ్ షోస్ తోనూ సూపర్ బిజీ. అయితే ఈ జానపద గాయని ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది.

తాజాగా మంగ్లీ తన పుట్టినరోజు వేడుకను చేవెళ్ల త్రిపురా రిసార్ట్‌లో ఘనంగా నిర్వహించింది. ప్రారంభంలో స్నేహితులు, సరదాగా సాగిన ఈ పార్టీ, అర్ధరాత్రి తర్వాత మాత్రం వివాదాస్పదంగా మారింది. పార్టీ సందర్భంగా గంజాయి  తగ్గినా కొంతమంది యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. అంతే కాకుండా విదేశీ మద్యం కూడా అక్కడ నుండి స్వాధీనం చేసుకున్నారు.

పార్టీకి ముందుగా అనుమతులు తీసుకోకపోవడంతో, రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ మరియు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డీజే నిర్వహించినందుకూ డీజే సిస్టమ్‌ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి టీవీ సెలబ్రిటీ దివి, గేయ రచయిత కాసర్ల శ్యామ్ సహా పలువురు ప్రముఖులు హాజరైనట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: Mahaa Conclave 2025: 650 కోట్లు స్వాహా.. జగన్ పై కేసు ..మంత్రి అనగాని క్లారిటీ.!

ఈ ఘటనపై మంగ్లీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “తెలంగాణ సంస్కృతి ప్రతినిధిగా నిలిచిన మంగ్లీ ఇలా గంజాయి వంటి వివాదాల్లో ఇరుక్కోవడమెందుకు?” అని ప్రశ్నిస్తున్నారు. ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించే మంగ్లీ, ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం తమను కలచివేస్తోందని అభిప్రాయపడుతున్నారు.

సాంప్రదాయాన్ని చాటే వారే ఇలా తప్పుదారి పడితే, ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? అన్న చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. మంగ్లీ స్పందన కోసం వేచి చూస్తున్నారు అన్నీ వర్గాల అభిమానులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Anil Ambani: నేడు ఈడీ విచారణకు అనిల్‌ అంబానీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *