Ravi Teja: మాస్ మహారాజా రవితేజ మరో సంచలన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో చేతులు కలిపిన రవితేజ, సూపర్ హీరో నేపథ్యంలో ఓ పాన్ ఇండియా చిత్రంతో రాణించనున్నారు. ‘మ్యాడ్’ సిరీస్‌తో అలరించిన కళ్యాణ్ శంకర్, రవితేజ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం, ఒక సినిమాతో ఆగకుండా సూపర్ హీరో ఫ్రాంచైజీగా రూపొందనుంది. మొదటి భాగం హిట్ అయితే, మరో రెండు భాగాలు తెరకెక్కే అవకాశం ఉందట.
Also Read: Rana Naidu Season 2: రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ విడుదల.. యాక్షన్, థ్రిల్ డబుల్‌గా!
Ravi Teja: రవితేజ పాత్రలో అసాధారణ శక్తులు, అత్యాధునిక విఎఫ్ఎక్స్తో ఈ సినిమా కనులవిందుగా ఉండనుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. రవితేజ యాక్షన్, కళ్యాణ్ శంకర్ కథాకళతో ఈ చిత్రం అభిమానుల అంచనాలను మించనుందని టాక్. కొత్త రూపంలో రవితేజను చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.


