The Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’ గురించి అభిమానులకు ఎగ్జైటింగ్ అప్డేట్ రానే వచ్చేసింది. ఈ సినిమా టీజర్ జూన్ 16న ఉదయం 10:52 గంటలకు విడుదల కానుంది. ఈ భారీ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: Coolie: రజినీ ‘కూలీ’ ఫీవర్.. మతిపోగొడుతున్న ఓవర్సీస్ రైట్స్!
The Rajasaab: సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ మరియు డ్రామాతో అభిమానులను అలరించనుందని టీమ్ వెల్లడించింది. ‘ది రాజాసాబ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టీజర్ రిలీజ్ తరువాత ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకోబోతున్నట్లు సమాచారం.
A day that promises a festival on the big screens just like we all dreamt of seeing our dearest darling #Prabhas ❤️❤️❤️
A lot more exciting days ahead…#TheRajaSaab pic.twitter.com/PFdV1mcqDJ
— Director Maruthi (@DirectorMaruthi) June 3, 2025
