Rakul

Rakul: హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్… రకుల్ సంచలన సమాధానం!

Rakul: బాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో హైదరాబాద్‌లో తనకు ఇల్లు గిఫ్ట్‌గా వచ్చిందన్న గాసిప్‌లపై తొలిసారి నోరు విప్పింది. “ఆ ఇల్లు నేనే సొంతంగా కొన్నాను. మా నాన్న పత్రాలన్నీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ రూమర్ విని ఆయన తీవ్రంగా కోప్పడ్డారు.

‘నువ్వు ఈ విషయంలో గట్టిగా స్పందించు’ అని సీరియస్ అయ్యారు” అని రకుల్ వెల్లడించింది. అయితే, ఇలాంటి నీచమైన వార్తలకు సమాధానం ఇవ్వడం వ్యర్థమని, అలాంటి పోర్టల్స్‌ ని పట్టించుకోనని స్పష్టం చేసింది.

Also Read: NTR-Prashanth Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ డ్రామా.. భారీ సెట్స్‌పై రచ్చ!

Rakul: తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా మెరిసిన రకుల్, ఇప్పుడు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఆమె, హిందీ చిత్రాలతో బిజీగా మునిగిపోయింది. తాజా ప్రాజెక్ట్‌లతో రకుల్ మరింత గ్లామర్‌గా, ట్రెండీగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Whiskey Market: అమెరికన్ విస్కీపై తగ్గిన టాక్స్.. మందుబాబులకు పండగే !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *