Phone Tapping Case:ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికా నుంచి ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు రాకపై ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన జూన్ 5న భారత దేశానికి తిరిగి రానున్నారు. దీంతో ఈ కేసులో కీలక నిందితుడైన ఆయన రాకతో మరో మలుపు తిరగనున్నదని భావిస్తున్నారు. అసలు విషయాలు బయటకొస్తాయని తెలుస్తున్నది.
Phone Tapping Case:ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లేఖను ప్రభాకర్‌రావు రాసిచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ప్రభాకర్‌రావును విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైంది. ఇప్పటికే నిందితులందరినీ దర్యాప్తు బృందం విచారించింది. కీలక నిందితుడైన ప్రభాకర్‌రావును విచారిస్తేనే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.


