Chandrababu

Chandrababu: తెలుగుజాతి ఆరాధించే ఏకైక నేత ఎన్టీఆర్‌.. నీతి, నిజాయతీ, పట్టుదల అయన ఆయుధాలు

Chandrababu: పసుపు జెండా.. అది కేవలం ఓ పార్టీకి మాత్రమే కాదు. అది తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. నందమూరి తారక రామారావు గారి స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఈరోజుతో 43 వసంతాలు పూర్తయిన సందర్భంగా, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో నిర్వహిస్తున్న మహానాడు వేదికపై ఎన్టీఆర్‌ను ఘనంగా స్మరించుకున్నారు.

‘‘ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండుగ రోజు’’ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు,
‘‘ఒకే వ్యక్తి రెండు విభిన్న రంగాల్లో రారాజుగా వెలుగొందిన ఘన చరిత్ర మన ఎన్టీఆర్ గారిది’’ అని పేర్కొన్నారు.

సినిమా రంగంలో ఎన్టీఆర్ తిరుగులేని యాక్టర్.. రాజకీయాల్లో ప్రజల మనసులను జయించిన నాయకుడు.
33 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం, 13 ఏళ్ల రాజకీయ సేవతో ఆయన ఆదర్శప్రాయంగా నిలిచారని సీఎం అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ అంటే ఏమిటి?

  • పేదవాడికి భరోసా

  • రైతుకు నేస్తం

  • అధికారం అంటే బాధ్యత

  • పదవి అంటే సేవ

ఈ నాలుగు విలువలతో జీవించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు.
“పాలకులు అంటే సేవకులే” అనే సిద్ధాంతాన్ని ప్రతిష్టించిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు.
అంతేకాక, దేశ రాజకీయ దిశను మార్చిన మహానాయకుడిగా ఆయన గుర్తింపునిస్తూ, అన్ని వర్గాల ప్రజలకీ ఎన్టీఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.

పసుపు జెండా శాశ్వతం

‘‘ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంతవరకు ఆ జెండా ఉప్పెనలా ఎగిరిపడుతుంది.
తెలుగు ప్రజల విశ్వాసం, నమ్మకం, భరోసా – ఇవన్నీ తెదేపా పతాకంలోనే ఉన్నాయి,’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

యువతకు అవకాశం – లోకేష్ ప్రగతిపై ప్రశంసలు

ఈ సందర్భంగా చంద్రబాబు యువత ప్రాధాన్యతను గుర్తు చేస్తూ,
‘‘మొదటిసారిగా 65 మంది యువతకు అవకాశం ఇచ్చాం. వారిలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు,’’ అని తెలిపారు.

లోకేష్ ప్రవేశపెట్టిన ఆరు శాసనాలు గొప్ప ఆలోచనలకు నిదర్శనమని, ఆయనకు ఉన్న నాలెడ్జ్‌తో భవిష్యత్తులో మించిన నాయకుడిగా ఎదుగుతారని అభినందించారు.

మహానాడు – ప్రజాభిప్రాయం ఆధారంగా పార్టీ విధానం

‘‘టీడీపీ కొత్త తరహా పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ప్రజాభిప్రాయం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాం. కార్యకర్తలే అధినేతలుగా ఈ మహానాడు నిర్వహిస్తున్నాం,’’ అని చెప్పారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటమి అయినా, మెజారిటీ భాగాల్లో ప్రజల మద్దతు తమదే అని తెలిపారు.

తెలుగు గడ్డపై మళ్లీ పుట్టినా, ఎన్టీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఉన్నాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి ఇది కేవలం జయంతి కాదని, ఎన్టీఆర్ ఆదర్శాలను గుర్తుచేసే స్ఫూర్తిదాయక రోజు అని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *