Mavoist:నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ

Mavoist: ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ ప్రాంతంలో జరిగిన నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సంచలన ఆరోపణలతో ఒక లేఖను విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ వెనుక లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం ఉందని మావోయిస్టులు ఆరోపించారు. గత ఆరు నెలలుగా కేశవరావు మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలిసినప్పటికీ, కేశవరావు బృందంలోని ఆరుగురు సభ్యులు ఇటీవల లొంగిపోవడం ద్వారా ఈ ఎన్‌కౌంటర్‌కు దారితీసిన సమాచారాన్ని అందించారని లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టులు తమ లేఖలో మరిన్ని వివరాలను వెల్లడించారు. కేశవరావును కాపాడేందుకు 35 మంది సభ్యులు తమ ప్రాణాలను అడ్డుపెట్టినట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేవలం ఏడుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారని, తాము ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించినందున ఎలాంటి కాల్పులు జరపలేదని వారు స్పష్టం చేశారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, తన సహచరులను వదిలి వెళ్లేందుకు కేశవరావు ఇష్టపడలేదని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖ ద్వారా మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌ను “నకిలీ”గా అభివర్ణిస్తూ, దీని వెనుక ఉన్న రాజకీయ కుట్రలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 


Posted

in

, , ,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial
Subscribe for notification