Kayadu Lohar: తమిళ సినిమా ‘డ్రాగన్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన కయదు లోహర్ ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని, వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అందాల తార ఊహించని వివాదంలో చిక్కుకుంది. తమిళనాట హాట్ టాపిక్‌గా మారిన TSMAC స్కామ్‌లో కయదు లోహర్‌కు సంబంధం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కామ్‌కు సంబంధించిన రాత్రి పార్టీల్లో పాల్గొనేందుకు ఆమెకు రూ.35 లక్షలు చెల్లించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కయదు లోహర్‌తో ఈ స్కామ్‌కు సంబంధం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ కాలంలో స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరోయిన్ ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
