Telangana Constables: తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. టీజీఎస్పీ బెటాలియన్లలో ఆందోళనలకు నేతృత్వం వహించి, ఇంటర్వ్యూలు ఇచ్చినవారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అంతకుముందు టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలపై డీజీపీ జితేందర్ ప్రకటన విడుదల చేశారు.
