Kannappa: మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం డిసెంబర్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక కఠిన ప్రదేశాల్లో జరిగిన సినిమా షూటింగ్ విజువల్స్ ను కూడా వీడియో షేర్ చేసింది యూనిట్. ఇప్పుడు సభ్యులతో కలసి కేథార్ నాధ్, బద్రీనాథ్ లోని ఆలయాలను సందర్శించారు మోహన్ బాబు, విష్ణు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా దాదాపు 160 కోట్ల బడ్జెట్ తో ‘కన్నప్ప’ సినిమాను రూపొందించారు విష్ణు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుపుకుంటోంది. నవంబర్ లో తొలి కాపీ సిద్ధం చేసి డిసెంబర్ లో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆరంభంలో ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా ప్రస్తుతం మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు, విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, వంటి తారలు నటిస్తున్నారు.
