Sama rammohan reddy: కవిత కొత్త పార్టీ ఆలోచనను స్వాగతిస్తున్నాం

Sama rammohan reddy: బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనను కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి స్వాగతించారు. కవిత రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కవితకు తన సొంత పార్టీ, కుటుంబ సభ్యులు, తోడబుట్టినవాళ్ల మీద తీవ్ర అసంతృప్తితో ఉంది. తండ్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తనకు న్యాయం చేయలేదన్న భావన ఆమెలో ఉందని సామా అన్నారు.

తనను జైల్లో వేసిన వారిని వదలనని గతంలో కవిత చెప్పిందని అన్నారు. అలాంటిది తనను జైల్లో పెట్టిన బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందని అనిపించే లోపాయికారి రాజకీయ ఒప్పందాలను ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని సామా ఆరోపించారు. అందుకే కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *