Tollywood: రాంగ్ రూట్‌లో రయ్యిమని యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్

Tollywood: టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వార్తల్లో నిలిచాడు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ జ‌ర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో ఆయన తన కారును రాంగ్ రూట్‌లో నడిపి పోలీసులకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సంఘటన సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ స్వయంగా వాహనం నడుపుతూ నిబంధనలకు విరుద్ధంగా వస్తుండగా, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని నిలిపి ప్రశ్నించాడు. కారులో ఉన్నది నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ అనే విషయం తెలుసుకున్న పోలీసులు రాంగ్ రూట్‌లో ఎందుకు వచ్చారో వివరణ కోరారు.

అంతటితో ఆయన వాహనాన్ని వెనక్కి తిప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడంతో సోషల్ మీడియా వేదికగా వీడియోలు విస్తృతంగా పంచుకుని ప్రజలు స్పందిస్తున్నారు. ప్రముఖ వ్యక్తులైతే నిబంధనలకు మరింత నిదర్శనంగా ఉండాలని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *