RAPO22

RAPO22: RAPO22లో ఉపేంద్ర సర్‌ప్రైజ్!

RAPO22: రామ్ పోతినేని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ RAPO22 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్, సాగర్ అనే పాత్రలో సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రామ్ బర్త్‌డే సందర్భంగా మే 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా, కన్నడ స్టార్ ఉపేంద్ర సూర్య కుమార్ పాత్రలో చిత్రంలో ఎంట్రీ ఇస్తున్నట్లు ఫస్ట్ లుక్‌తో సహా వెల్లడించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఉపేంద్ర ఎంట్రీతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. టైటిల్ ఏమిటన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రామ్ ఎనర్జీ, ఉపేంద్ర సర్‌ప్రైజ్‌తో RAPO22 బాక్సాఫీస్‌ను రచ్చ చేయనుందని ట్రేడ్ వర్గాల టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *