Pradeep Ranganathan: తమిళ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ వరుస సక్సెస్‌లతో సంచలనం సృష్టిస్తున్నాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో యూత్‌ను ఉర్రూతలూగించిన ప్రదీప్, ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK)లో కృతి శెట్టితో జోడీ కడుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక కీర్తిశ్వరణ్ డైరెక్షన్‌లో ‘డ్యూడ్’ సినిమాలో మమితా బైజుతో నటిస్తున్న ప్రదీప్, ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ప్రదీప్, తమిళ సినిమాలో కొత్త సంచలనంగా మారాడు. యూత్‌కు కనెక్ట్ అయ్యే కథలతో ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాయని అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు.
