Single: టాలీవుడ్ యంగ్ ఎంటర్‌టైనర్ శ్రీవిష్ణు మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు! కేతిక శర్మ, ఇవానా హీరోయిన్‌లుగా, దర్శకుడు కార్తిక్ రాజు తెరకెక్కించిన ‘సింగిల్’ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా శ్రీవిష్ణు ఖాతాలో మరో విజయంగా నిలిచింది. రిలీజ్‌తోనే అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ, వీకెండ్‌లో సాలిడ్ వసూళ్లతో సందడి చేస్తోంది.
బుక్ మై షోలో కేవలం రెండు రోజుల్లో 1.5 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అవ్వడం ఆడియెన్స్‌లో సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. ఆదివారం కూడా బుకింగ్స్ జోరుగా కొనసాగుతుండగా, మూడో రోజు కూడా భారీ కలెక్షన్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో విడుదలైన ‘సింగిల్’, శ్రీవిష్ణు బ్రాండ్‌కు తగ్గట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. మరి, ఈ హిట్ జోరు ఎంతకాలం కొనసాగుందో చూడాలి!
