Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్, డ్యాన్సర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మల వివాహ బంధం తాజాగా ముగిసిన విషయం తెలిసిందే. 2020లో పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట.. నాలుగేళ్ల వ్యవధిలోనే విడిపోయారు. కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారన్న వార్తలు వచ్చాయి. చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసుకుని తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలు ప్రారంభించారు.
విడాకుల అనంతరం ధనశ్రీ సినీ రంగం వైపు అడుగులు
విడాకుల తర్వాత ధనశ్రీ వర్మ పూర్తిగా సినీ రంగంలోకి ముస్తాబవుతోంది. ఇటీవలే తెలుగులో ‘ఆకాశం దాటివస్తావా’ అనే చిత్రంలో కథానాయికగా కనిపించింది. ఇప్పుడు హిందీ చిత్రం ‘భూల్ చుక్ మాఫ్’ లో ఒక ప్రత్యేక గీతంలో సందడి చేసింది. ఈ సినిమాలోని ‘టింగ్ లింగ్ సజా మే’ అనే పాటలో ఆమె రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి స్టెప్పులు వేసింది. ఈ పాటకు ఇర్షాద్ కామిల్ సాహిత్యం అందించగా, సంగీతాన్ని తనిష్క్ బాగ్చి సమకూర్చారు.
ఇది కూడా చదవండి: JVAS Sequel: మనసులో మాట బయటపెట్టిన చిరంజీవి.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో JVAS సీక్వెల్..?
ధనశ్రీ స్వయంగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తింది. సినిమాల్లో నటించడంపై ఆమెకు పెద్ద ఆసక్తి ఉన్నట్టు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
చాహల్ మైదానంలో, ధనశ్రీ తెరపై.. ఇద్దరూ తమ కెరీర్‌లలో బిజీ
మరోవైపు యజువేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్ తరపున కీలక స్పిన్నర్‌గా కొనసాగుతున్న అతను తన ఆటపై పూర్తి దృష్టి పెట్టాడు. ఇద్దరూ తమ తమ రంగాల్లో ముందుకు సాగుతుండగా, వ్యక్తిగత జీవితం పూర్తిగా వేరుగా మారిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
విచ్ఛిన్నానికి కారణం అదేనా?
విడాకుల అనంతరం ధనశ్రీ వెంటనే సినిమాల్లో బిజీ కావడం చూసి, వారి విడాకులకు నటనా రంగమే కారణమా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై చాహల్ గానీ, ధనశ్రీ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. వారి జీవన ప్రయాణం ఎటు తేలుతుందో చూడాలి.
View this post on Instagram