Coolie

Coolie: ‘కూలీ’ కౌంట్‌డౌన్ షురూ… ఇంకో 100 రోజుల్లో సందడి!

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభవార్త! ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ సినిమా విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సన్ పిక్చర్స్ బ్యానర్ ఓ స్పెషల్ ప్రోమో వీడియోను విడుదల చేసింది.

అనిరుద్ సంగీతంతో వచ్చిన ఈ వీడియో అభిమానుల్లో జోష్ నింపింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. రజినీ దేవా పాత్రలో కనిపించనుండగా, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి స్టార్ కాస్ట్ ఉంది. ఆమిర్ ఖాన్ కేమియో, పూజా హెగ్డే స్పెషల్ డాన్స్ నంబర్ హైలైట్‌గా నిలవనున్నాయి.

Also Read: Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు సినిమా… నిజమా?

Coolie: ఈ సినిమా ఆగస్టు 14న విడుదలై ‘వార్ 2’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. రజినీ 171వ చిత్రంగా, లోకేష్‌తో ఆయన తొలి కలయికగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీతో ‘కూలీ’ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *