CM Revanth Reddy

Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం

Revanth Reddy: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ,ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి)లో ఈరోజు ఉదయం 11 గంటలకు అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

సమావేశం ప్రారంభానికి ముందు వాతావరణం ఉత్కంఠతో నిండింది

ఇప్పటికే అన్ని సంబంధిత శాఖలకు సమాచారం పంపిన ప్రభుత్వం, ముఖ్యమైన భద్రతా అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీస్ చీఫ్‌లు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. అధికారులు, మీడియా వర్గాలు సమావేశ ప్రారంభంపై నిరీక్షణలో ఉన్నారు.

ఎలాంటి అంశాలపై చర్చ జరగనుంది?

ఈ సమీక్షలో:

  • రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన సంస్థాపనలు

  • సైనిక, పరిరక్షణ సంబంధిత కేంద్రాలు

  • రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఐటీ పార్కులు

  • ప్రజలు ఎక్కువగా చేరే ప్రదేశాలపై భద్రతా సమీక్ష జరుగనుంది.

రాష్ట్రం తరపున జాతీయ భద్రతకు మద్దతు

CMO విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం జాతీయ సాయుధ దళాలకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తుంది. భద్రత విషయంలో కేంద్రంతో కలసి పనిచేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *