Crime News

Crime News: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు దారుణ ఘటన

Crime News: మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫిర్యాదుదారుడిని రాజీకి రావాలని ఒత్తిడి చేస్తున్నాడు . దీనికి ఆతను అంగీకరించకపోవటంతో అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేసు రాజీ చేసుకోవడానికి ఒప్పుకోలేదని కత్తి తో దాడి చేసి హతమార్చాడు. తన ఇంటి గడప ముందే విగత జీవిగా పడివున్న కుటుంబ సభ్యుడిని చూసి బంధువులు విలవిలలాడి పోయారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది.

నిడదవోలు చింతచెట్టు వీధిలో నివసించే వల్లీ భాషా స్థానికంగా వంట మేస్త్రీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుమార్తెను సిరంగల్ అనిల్ అనే వ్యక్తి వేధిస్తుండటంతో అతనిపై 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ట్రయిల్‌కు వచ్చింది. ఈ కేసులో నిందితుడు అనిల్ గత కొద్దీ రోజులుగా భాషా వద్దకు వచ్చి రాజికి రావాలని కోరుతున్నాడు. దీనికి భాషా అంగీకరించకపోవటంతో అతడిపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే భాషా మే 04న నమాజ్ కోసం మసీదుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో అనిల్ అక్కడికి చేరుకుని బాధితుడిపై కత్తితో దాడి చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుటుంబ పెద్ద చనిపోవటంతో భాషా కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *