Sreesanth: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై కేరళ క్రికెట్ అసోసియేషన్ 3 సంవత్సరాల పాటు స్పెన్షన్ విధించింది. సంజూ శాంసన్ విషయంలో రాష్ట్ర అసో సియేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గానూ రాష్ట్ర క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30న జరిగిన స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలో శ్రీశాంత్ పై కేరళ క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చింది. అయితే చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన టీమిండియా జట్టులో సంజూ శాంసన్ కు స్థానం లాభించలేదు.
శాంసనక్ కు స్థానం దక్కకపోవడానికి కేసీఏనే కారణమని శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ జట్టు నుంచి శాంసన్ ను తప్పించడం అతన్ని ఎంపిక చేయ కపోవడానికి కారణమైందని తెలిపాడు. దీంతో శ్రీశాంత్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కేరళ క్రికెట్ అసోసియేషన్ అతనికి నోటీసు అందజేసింది. అయితే, శ్రీశాంత్ ఇచ్చిన సమాధానంతో రాష్ట్ర అసోసియేషన్ సంతృప్తి చెందకపోవడంతో అతనిపై చర్యలకు నిర్ణయం తీసుకుంది.
Also Read: Csk Vs Rcb: ఈరోజు RCB గెలిస్తే ఏమవుతుంది?
Sreesanth: శాంసన్‌కు మద్దతుగా నిలిచినందుకు చర్యలు తీసుకోలేదని, అసోసియేషన్‌కు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేరళ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. కేరళ క్రికెట్ లీగ్ లోని కొల్లం ఏరీస్ ఫ్రాంచైజీకి శ్రీశాంత్ సహయజమానికిగా ఉన్నాడు. శ్రీశాంత్ తో పాటు కొల్లం ఏరీస్, అలప్పుళ టీమ్ లీడ్ అలప్పుల రిప్పల్స్ ఫ్రాంచైజీల కు కూడా కేసీఏ నోటీసులు ఇచ్చింది. అయితే, ఫ్రాంచైజీల ఇచ్చిన రెస్పాన్స్ సంతృప్తికరంగా ఉండటంతో వాటి మీద ఏ విధమైన చర్యలు ఉండవని కేసీఏ తెలిపింది.
