Kalyan Ram: ఇటీవల తమ్ముడు ఎన్టీఆర్ తో నిర్మాతగా ‘దేవర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన కళ్యాణ్ రామ్ తను హీరోగా నటిస్తున్న సినిమా కోసం వైజాగ్ వెళ్ళాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సొంత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై 21న సినిమాగా రూపొందిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించే ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు వైజాగ్ పరిసరాల్లో జరగనుంది. ‘బింబిసార’ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్, డెవిల్’ నిరాశపరటంతో అప్పుడు తన ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. దానికి తగ్గట్లే భారీ బడ్జెట్ తో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచుంతోంది. ముంబై భామ సాయిమంజ్రీకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాతగా ‘దేవర’తో సక్సెస్ కొట్టిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో హీరోగానూ విజయాన్ని అందుకుంటాడేమో చూద్దాం.
