Kavitha vs Harish Rao

Kavitha vs Harish Rao: అన్నాచెల్లెళ్ల ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరిందా?

Kavitha vs Harish Rao : బిఆర్‌ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. గత ఏడాదిన్నరగా అజ్ఞాతంలో ఉన్న కెసిఆర్ బయటకొచ్చి, పార్టీ భవిష్యత్ దిశానిర్దేశాన్ని ఇవ్వడమే కాదు, వారసుడినీ ప్రకటిస్తారని అందరూ భావించారు. అందుకే సభకు భారీగా తరలి వచ్చారు. సభ వేదికపై కెసిఆర్, కెటిఆర్ పోస్టర్ మాత్రమే ఉండడంతో వచ్చిన జనానికి విషయం అర్థమైంది. సభకు హాజరైన ప్రజల్లో ఉత్తేజం నింపేందుకు కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. సభలోకి కవిత ఎంట్రీ సందర్భంగా కవితపై పాట పాడడం కోసం ఓ కళాకారుడు వెళితే అనుమతించలేదు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆ వ్యక్తిని తోసెయ్యడమే కాదు, బౌన్సర్‌లను పెట్టి మరీ గెంటేశారు.

సభ ప్రారంభానికి ముందే కళా వేదికపై జరిగిన రసాబాసతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వివాదాన్ని ఉటంకిస్తూ బీఆర్‌ఎస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పెద్దాయన కేసీఆర్ అంటే ఆ పార్టీ నేతల్లో భయం లేకుండా పోయిందని, ఇందుకు నిదర్శనమే ఈ వాగ్వాదం అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలకు ఈ ఘటన నిదర్శనమని చెప్పారు. సామ రామ్మోహన్‌ రెడ్డి పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Telangana Bonalu: తెలంగాణలో బోనాల సంబురం.. ఆ రోజు నుంచే ప్రారంభం

Kavitha vs Harish Rao: కవిత జైలు నుంచి విడుదలైన వెంటనే తన సొంత కార్యాచరణను అమలు చేస్తున్నారు. కులగణనను బిఆర్‌ఎస్ వ్యతిరేకిస్తే ఆమె సమర్థించారు. కొంత కాలం కార్యక్రమాలలో ఎక్కడా గులాబి జెండా వాడని కవిత, నియోజకవర్గాల్లోనూ సొంతంగానే సమావేశాలు ఏర్పాటు చేసిన కవిత, ఒక దశలో సొంత పార్టీ పెడుతున్నారన్న రూమర్లు వినిపించాయి. సభ నేపథ్యంలోనే బిఆర్‌ఎస్‌లో యాక్టివ్ అయిన కవిత, కెసిఆర్ తర్వాత తానే నెం.2 అని ప్రకటించడమే… రజతోత్సవ సభలో రసాభాసకు దారితీసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *