Samantha

Samantha: సామ్ రెండో పెళ్లి.. కన్ఫామా?

Samantha: సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న సామ్, రెండో పెళ్లికి సిద్ధమవుతుందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా, సమంత తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో మే నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరూ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఇరు కుటుంబాలు కూడా ఈ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై సమంత లేదా రాజ్ ఇప్పటివరకు స్పందించలేదు.ఇదిలా ఉంటే, సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమా కూడా చర్చనీయాంశమైంది.

Also Read: ALCC Movie: ‘ఏ ఎల్ సి సి’ సినిమా బిగ్ టికెట్ లాంచ్ వేడుకను ప్రముఖ దర్శకుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు!

Samantha: ఈ చిత్రంలో కొత్త నటీనటులు అద్భుతంగా నటించారని సామ్ ప్రశంసించింది. తన కెరీర్ ఆరంభంలో నటన గురించి పెద్దగా తెలియదని, కానీ ఈ కొత్త తరం నటులు అద్వితీయ ప్రతిభ కనబరిచారని చెప్పుకొచ్చింది. సమంత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం రెండూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరి, ఈ రూమర్స్ నిజమవుతాయా? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *