Aghori

Aghori: వర్షిణీని పెళ్లి చేసుకున్న లేడీ అఘోరీ

Aghori: తెలుగు రాష్ట్రాల్లో చర్చకు కేంద్రబిందువుగా మారిన లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి వర్షిణీతో వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో ఈ వివాహం జరగగా, వర్షిణీ మెడలో తాళి కట్టిన అఘోరీ దృశ్యాలు, వారు దండలు మార్చుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వివాహ సమయంలో పలువురు భక్తులు పాటలు పాడుతూ జంటను ఆశీర్వదించినట్టు తెలుస్తోంది.

ప్రేమకు మారిన పరిచయం

ఈ ప్రేమకథకు నాంది నందిగామలో పడింది. అక్కడ లేడీ అఘోరీను వివస్త్రంగా చూసిన వర్షిణీ, అతడికి దుస్తులు తడిగింది. ఈ సంఘటనతో ఇద్దరి మధ్య అనుబంధం మొదలైంది. అఘోరీ కొంతకాలం వర్షిణీ ఇంట్లో గడిపిన తరువాత, ఆమెను తన వెంట తీసుకెళ్లాడు. గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో తిరిగిన తరువాత, వర్షిణీని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే కొన్ని రోజుల తరువాత వర్షిణీ మళ్లీ అఘోరీతో వెళ్లిపోయింది.

ఇది కూడా చదవండి: Supreme Court: పెద్దగా సీరియస్ నెస్ లేదు… పిల్లల అక్రమ రవాణాపై యూపీ ప్రభుత్వాన్ని ఎస్సీ ‘తిట్టింది

ఇతర యువతుల ఆరోపణలు

ఈ వివాహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మరో షాకింగ్ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఓ యువతి లేడీ అఘోరీపై సంచలన ఆరోపణ చేసింది. తనను జనవరి 1న పెళ్లి చేసుకున్నాడని, జనవరి 13న వర్షిణీతో రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. “మొదటి భార్యగా నేను ఉన్నప్పుడే ఇంకో పెళ్లి ఎలా?” అంటూ ఆ యువతి ప్రశ్నించింది. ఆమె లేడీ అఘోరీపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ పోలీసులను కోరింది.

పోలీసుల విచారణ, సామాజిక స్పందన

ఈ ఘటనపై ఇప్పటికే వర్షిణీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. అప్పట్లో పోలీసులు ఆమెను తిరిగి తీసుకువచ్చారు కానీ, తర్వాత మళ్లీ వర్షిణీ స్వచ్ఛందంగా అఘోరీతో వెళ్లిపోయిందని సమాచారం. కాగా, తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ రెండో పెళ్లి ఆరోపణతో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశముంది. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇది వారి వ్యక్తిగత జీవితం అన్న వాదనలు వస్తుంటే, మరోవైపు మానవతా విలువల పేరిట ఈ వ్యవహారాన్ని విమర్శిస్తున్నారు.

ALSO READ  Eesaraina Movie Review: గవర్నమెంట్ జాబ్ కోసం యువకుని తపన . . "ఈసారైనా?!" ఫలించిందా?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *