Akhanda 2

Akhanda 2: అఖండ 2: బాలయ్య, బోయపాటి మధ్య గొడవలు?

Akhanda 2: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం అఖండ 2 ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా అఖండ సినిమా అన్ని రికార్డులను తిరగరాసి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.

ఇప్పుడు అఖండ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై కొన్ని ఆసక్తికర రూమర్స్ వైరల్ అవుతున్నాయి.బాలయ్య, దర్శకుడు బోయపాటి మధ్య విభేదాలు తలెత్తాయని, షూటింగ్ సజావుగా సాగడం లేదని కొన్ని వదంతులు షికారు చేశాయి. కానీ ఈ గుసగుసల్లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం.

Also Read: Jack Twitter Review: జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..ఈసారి సిద్ధు మేజిక్ వర్కౌట్ అయ్యిందా

Akhanda 2: షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతోందని, ఈ రూమర్స్‌ను కొట్టిపారేసేలా సమాచారం అందుతోంది. ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తుండగా, 14 రీల్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు బోయపాటి స్టైల్ డైరెక్షన్‌తో అఖండ 2 మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *