Telangana News:రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. కొందరి ప్రాణాలు పోతుండగా, ఇంకొందరు ఇతరుల ప్రాణాలు తీస్తుండగా, మరికొందరు కేసుల పాలవుతున్నారు. కనీసం విచక్షణను కూడా మరుస్తున్నారు. ఇక్కడా అదే జరిగింది. అది పోలీస్ వాహనమని తెలిసి కూడా ఆ వాహనంలో ఎంచక్కా చక్కర్ల కొడుతూ కొందరు యువకులు రీల్స్ పిచ్చిని తీర్చుకున్నారు. అది కాస్తా వైరల్‌గా మారి కేసు దాకా వెళ్లేలా ఉన్నది.
Telangana News:ఎస్ఐకి చెందిన ఓ పోలీస్ వాహనాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలో కొందరు యువకులు చెప్పకుండా తీసుకెళ్లారు. దానిపై చక్కర్లు కొడుతూ రీల్స్ షూట్ చేసుకున్నారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారి, పోలీస్ అధికారుల దాకా వెళ్లింది. రీల్స్ మోజులో వారంతా వెర్రి వేశాలు వేశారు. దీంతో స్పందించిన సీఐ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.

