Kadiyam Srihari: మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం పర్యటనలో అపశృతి నెలకొన్నది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఓ దుకాణం ప్రారంభోత్సవానికి ఆయన బుధవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా నిర్వాహకులు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు అక్కడే ఉన్న టెంట్‌కు అంటుకోగా, పోలీసులు, ఇతరులు ఆ టెంట్‌ను తొలగించి, మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కడియం శ్రీహరి దుకాణాన్ని ప్రారంభించి, దుకాణంలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
