LYF Movie Review

LYF Movie Review: ఫాదర్ సెంటిమెంట్ చుట్టూ నడిచే LYF

LYF Movie Review: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ చాలా ఏళ్ళ విరామం తర్వాత నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్). మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ పతాకాలపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి సంయక్తంగా నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ప్రధాన తారాగణం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

స్టోరీ:
LYF Movie Review: కిషోర్ (ఎస్పీ చరణ్), సిద్ధూ (శ్రీ హర్ష) తండ్రీ కొడుకులు. అనాథలకు ఆపద వస్తే సాయం అందించడంలో నలుగురి కంటే నాలుగు అడుగులు ముందు ఉంటాడు కిషోర్. తండ్రి అడుగుజాడల్లో కొడుకు నడుస్తాడు. అనాథ శవాలకు సొంత డబ్బుతో దహన సంస్కారాలు జరిపిస్తాడు కిషోర్. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం హార్స్ రైడింగ్ బెట్టింగ్ కాస్తాడు. ప్రతిసారి అతడు బెట్ నెగ్గుతాడు. గుర్రాలకు, హార్స్ రైడర్లకు స్టెరాయిడ్స్ ఇవ్వడం ద్వారా కిషోర్ బెట్టింగ్స్ నెగ్గుతున్నాడని, అనాథ శవాలకు దహన సంస్కారాల పేరుతో చేసే సేవ వెనుక పెద్ద స్కాం ఉందని వార్తలొస్తాయి. దీని వెనుక బడా బిజినెస్ మ్యాన్ కబీర్ (నవాబ్ షా) ఉంటాడు. కిషోర్, సిద్ధూను అతను ఎందుకు టార్గెట్ చేశాడు? కాశీలో శివ భక్తులు ఎటువంటి సాయం అందించారు? అనేది సినిమా.

అనాలిసిస్:
LYF Movie Review: ‘అఖండ’, ‘కార్తికేయ 2’ నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు మైథాలజీ పాయింట్ టచ్ చేసినవి కన్పిస్తాయి. డివోషనల్ టచ్ ఉన్న ఫాంటసీ ఫిలిమ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. ‘లవ్ యువర్ ఫాదర్’ కూడా ఆ లిస్టులోకి వచ్చే సినిమా.

‘లవ్ యువర్ ఫాదర్‌’ సినిమాలో డివోషనల్ పాయింట్ ఉంది. అది కావాలని ఇరికించినది కాదు. కథలో అది మేజర్ పార్ట్. దాన్ని డామినేట్ చేసేలా ఎక్కువ స్క్రీన్ టైమ్ కాలేజీ ఎపిసోడ్ తీసుకోవడంతో ఇంటర్వెల్ ముందు అసలు కథలో కీలకమైన ఘట్టం మొదలు అవుతుంది. సెకండాఫ్ కూడా ఫాంటసీ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఫ్లోని కొంత డైవర్ట్ చేసినా నవ్విస్తాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. రెగ్యులర్ అన్పించే కామెడీ సీన్స్, కాలేజీ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే డివోషనల్ సీన్స్ హై ఇస్తాయి. మధ్య మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నా అందర్నీ మెప్పించే డివోషనల్ పాయింట్ కోసం క్షమించవచ్చు.

LYF Movie Review

LYF Movie Review: మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ‘లవ్ యువర్ ఫాదర్’కు బలం. శివుని నేపథ్యంలో ఆయన చేసిన పాట, శివ భక్తుల సన్నివేశాలకు ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్ బంప్స్ ఇస్తాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. డైలాగ్స్ మీద వర్క్ సరిగా చేయలేదు. కామెడీపై కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.

తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బావుంది. రెగ్యులర్ ఆర్టిస్ట్స్ చేసినట్టు కాకుండా కొత్తగా ట్రై చేశారు. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. డ్యాన్స్ బాగా చేశారు. కాన్సంట్రేట్ చేస్తే మంచి ఆర్టిస్ట్ అవుతాడు. కషికా కపూర్ గ్లామర్ ఆడియన్స్ నోటీస్ చేస్తారు. రఘుబాబు, ప్రవీణ్, షకలక శంకర్, భద్రం తదితరులు కామెడీ చేశారు.

కమర్షియల్ హంగులతో కూడిన కంటెంట్ బేస్డ్ సినిమాల కోసం చూసే ఆడియన్స్ ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) వైపు చూడవచ్చు. కొంత ల్యాగ్, రొటీన్ సీన్స్ ఉన్నా డివోషనల్ పాయింట్, క్లైమాక్స్ ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తాయి. శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *