The Paradise

The Paradise: ఆగిపోయిన ‘ది ప్యారడైజ్’? మేకర్స్ క్లారిటీ!

The Paradise: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. టీజర్ గ్లింప్స్‌తో అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై ఊహించని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బడ్జెట్ సమస్యలతో సినిమా ఆగిపోతుందని సోషల్ మీడియాలో గుసగుసలు షురూ కాగా, మేకర్స్ దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రూమర్స్ స్ప్రెడ్ చేసేవాళ్లకు సమాధానం థియేటర్లలో మా సినిమాతో చూపిస్తాం’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిన మేకర్స్, ‘వాళ్ల సమయం దగ్గరపడింది, వెయిట్ చేయండి’ అని వార్నింగ్ కూడా జారీ చేశారు. ‘ది ప్యారడైజ్’ టాలీవుడ్‌లో ఐకానిక్ మూవీగా నిలుస్తుందని, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని మేకర్స్ స్పష్టం చేశారు. ‘మేం ఈ సినిమాను గర్వంగా తీస్తున్నాం’ అని క్లియర్‌గా చెప్పారు. ఈ ధమాకా రిప్లైతో సినిమా క్రేజ్ రెట్టింపు అయ్యింది. రూమర్స్‌ను తిప్పికొట్టి, ఊహించని బజ్‌ను సృష్టించిన ‘ది ప్యారడైజ్’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కౌంటర్‌తో సినిమా హైప్ మరో లెవెల్‌కు చేరిందని అంతా అంటున్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *