Botsa In Janasena

Botsa In Janasena: వైసీపీని చావుదెబ్బ కొట్టే వ్యూహం?

Botsa In Janasena: ఏపీ రాజకీయాల్లో సంచలనం! జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీని చావుదెబ్బ కొట్టే వ్యూహంలో ఉన్నారా? వైసీపీ నంబర్ 2 నేతను జనసేనలోకి ఆకర్షించేందుకు ప్లాన్‌ రెడీ చేశారా? జగన్ పదవులతో కట్టిపడేసినా, సరైన సమయం కోసం ఆ నేత ఎదురుచూస్తున్నారా? ఒకప్పుడు జనసేనను లెక్కచేయని వైసీపీ, ఇప్పుడు పవన్ చేరికల వ్యూహంతో కుదేలవుతోందా? విజయసాయిరెడ్డి వెళ్లారు, ఇక ఆ నేత కూడా వెళ్లిపోతే వైసీపీ డౌన్‌ఫాల్ ఖాయమేనా? ఒక్క సీటుతో మొదలుపెట్టిన జనసేన, ఇప్పుడు జగన్‌కు నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తోందా? ఇంతకీ ఎవరా వైసీపీ నంబర్‌ 2 లీడర్‌.? టేక్‌ ఎ లుక్‌.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగులు వైసీపీని బెంబేలెత్తిస్తున్నాయి. ఒకప్పుడు ఒక్క సీటుతో మొదలైన జనసేన, ఇప్పుడు వైసీపీకి అతిపెద్ద శత్రువుగా మారి, జగన్‌కు నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది. ఎన్నికల్లో వైసీపీని చెప్పి మరీ అథఃపాతాళానికి తొక్కిన పవన్, ఇప్పుడు ఆ పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేలా చేరికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గత పది నెలల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వంటి కీలక నేతలను జనసేనలో చేర్చుకున్న పవన్, ఇప్పుడు వైసీపీలో నంబర్ 2 స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణపై ఫోకస్ పెట్టారట. ఈ చేరిక జరిగితే, వైసీపీకి చావుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పవన్ దీర్ఘకాలిక వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీని బలహీనపరచడం, జనసేనను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడం దిశగా ఆయన అడుగులు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే బొత్సను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో బలమైన పట్టున్న బొత్స, తూర్పు కాపు సామాజిక వర్గంలో కీలక నేత. విజయనగరం జిల్లాలో ఆయన కుటుంబ ప్రభావం, రాష్ట్రవ్యాప్తంగా బొత్స కుటుంబానికి ఉన్న రాజకీయ సంబంధాలు.. జనసేనకు బలం చేకూరుస్తాయని పవన్ భావిస్తున్నారట. గతంలో పవన్‌తో బొత్స ఆత్మీయ ఆలింగనం, వ్యక్తిగత సంబంధాలు ఈ చేరికకు బీజం వేసినట్లు కనిపిస్తోంది. జనసేన శ్రేణులు కూడా బొత్స చేరికను స్వాగతిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Waqf Bill: వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

అయితే, జగన్… బొత్సను పదవులతో తెలివిగా కట్టిపడేశారు. ఎమ్మెల్సీగా, మండలిలో ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా ఇచ్చి సంతృప్తి పరిచారు. దీంతో, వైసీపీని వీడేందుకు సరైన సమయం కోసం బొత్స ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా కట్టబెట్టిన వైసీపీని ఉన్నఫలంగా వీడితే.. ప్రజల్లో ఎక్కడ నెగటివ్‌ ఇమేజ్‌ వస్తుందోనని బొత్స తటపటాయిస్తున్నారట. వైసీపీని వీడేందుకు అవసరమైన పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఆలోచిద్దామని, అప్పటి దాకా కాస్త ఓపికగా ఉండమని తనని ఒత్తిడి చేస్తున్న సన్నిహితులు, అనుచరులకు నచ్చజెపుతున్నారట బొత్స.

ALSO READ  Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ ఇప్పటికే విజయసాయిరెడ్డి వంటి కీలక నేతను కోల్పోయింది. బొత్స కూడా వెళితే, ఆ పార్టీ మానసికంగా కుంగిపోవడమే కాక, రాజకీయంగా డౌన్‌ఫాల్ అవడం ఖాయం. ఒకప్పుడు జనసేనను పార్టీగా కూడా గుర్తించని వైసీపీ, ఇప్పుడు పవన్ వ్యూహాల ముందు నిలవలేక చతికిలపడుతోంది. స్థానిక ఎన్నికల నాటికి జనసేనను అజేయ శక్తిగా తీర్చిదిద్దాలన్న పవన్ ప్లాన్‌లో.. బొత్స చేరిక కీలకం కానుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు లేరన్న పవన్ సిద్ధాంతం ఇక్కడ సాకారమవుతోంది. బొత్స జనసేనలో చేరితే, వైసీపీకి కోలుకోలేని దెబ్బే అవుతుంది. ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందంటున్నారు అనలిస్టులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *