Ippala Ravindra: డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం ఫోటోలు, వీడియోల కోసం మాత్రమే కాదు. అది ఒక్కోసారి జీవితాలను బద్దలు కొట్టే ఆయుధం కూడా అవుతుంది! ఇక్కడ ఒక్క ఫోటో చూస్తే కథ మొత్తం అర్థం అవుతుంది. ఒక వీరాభిమాని నిజస్వరూపాన్ని బట్టబయలు చేసి, అతని కెరీర్‌ని కూడా కొంపముంచిన స్టోరీ ఇది. ఆ హీరో మరెవరో కాదు… వైసీపీ డై హార్డ్ ఫ్యాన్, సోషల్ మీడియా సైకోగా పేరొందిన ఇప్పాల రవీంద్రారెడ్డి!
ఇప్పాల రవీంద్రారెడ్డి… ఈ పేరు వినగానే నెటిజన్లకు ఒకటే గుర్తొస్తుంది. జగన్‌ని ఎవరైనా చిన్న విమర్శ చేసినా సరే.. నోటికొచ్చినట్లు తిట్టే ఉన్మాది అని ఇట్టే గుర్తుపట్టేస్తారు నెటిజన్లు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇప్పాల సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లను టార్గెట్ చేసి… “నీచం అంటే ఇతనే గురు!” అనుకునేలా వ్యాఖ్యలు చేశాడు. కుటుంబ సభ్యులపై కూడా నోరు పారేసుకుని, అడ్డూ అదుపూ లేని ఆరాటం ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను ఏకిపారేశాడు. జగన్ కోసం ప్రాణమైనా ఇస్తా! అన్నట్లుగా రెచ్చిపోయాడు. కానీ వైసీపీ ఓడిపోయాక, సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. ఇప్పాల సైలెన్స్‌ని చూసి.. “అధికారం పోతే.. అభిమానం కూడా పోయిందా ఇప్పాలా?” అని అంతా అనుకున్నారు.
కట్ చేస్తే… సడన్‌గా ఒక రోజు మంత్రి నారా లోకేష్‌తో ఇప్పాల రవీంద్రారెడ్డి నవ్వుతూ కనిపించాడు. ఏపీ ప్రభుత్వం, సిస్కో కంపెనీ మధ్య జరిగిన ఒప్పందం కార్యక్రమంలో ఇప్పాల కూడా పాల్గొన్నాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు ఫైర్ అయ్యారు. “ఇప్పాల ఏంటి ఈ డ్రామా? లోకేష్‌ని తిట్టిన నోటితోనే.. ఇప్పుడు ఆయన పక్కన నిల్చుని నవ్వుతున్నావా?” అంటూ మండిపడ్డారు. ఇలాంటి వాడిని అసలు లోకేష్ దగ్గరకు ఎలా రానిచ్చారంటూ లోకేష్ టీమ్‌పైనా విమర్శలు వచ్చాయి. దీంతో లోకేష్ కూడా ఈ విషయంలో సీరియస్‌గా స్పందించారు.
Also Read: Nandamuri Varasulu: రంగం సిద్ధం.. లైట్స్ ఆన్.. యాక్షన్ స్టార్ట్!
Ippala Ravindra: లోకేశ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి ఐటీ విభాగం ఓఎస్‌డీ వినాయకసాయి చైతన్య సిస్కో యాజమాన్యానికి ఘాటుగా లేఖ రాశారు. గతంలో టీడీపీ నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రవీంద్ర రెడ్డి పెట్టిన అసభ్యకరమైన పోస్టులను ఆ లేఖకు జత చేశారు. రవీంద్ర రెడ్డికి ఏపీలో సిస్కో చేపట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని తాము భావించడం లేదనీ… ఏపీలో చేపట్టేబోయే ఏ ప్రాజెక్టులోనూ ఆయనను భాగస్వామి చేయవద్దనీ సిస్కో యాజమాన్యాన్ని ఆ లేఖలో కోరారు. ఇక సిస్కో సంస్థ కూడా ఈ మ్యాటర్‌ని సీరియస్‌గా తీసుకుంది. దీనిపై స్పందించిన సిస్కో యాజమాన్యం రవీంద్ర రెడ్డిని ఏపీ ప్రాజెక్టుల నుంచి తప్పించినట్లు సోమవారం లోకేశ్ పేషీకి సమాచారం పంపింది.
ఇప్పాల రవీంద్రారెడ్డిది సిస్కోలో చిన్నా చితకా పొజిషన్ ఏమీ కాదు. సిస్కోలో దక్షిణాది రాష్ట్రాల అకౌంట్ మేనేజర్‌గా ఉన్నాడు. అంత హై ప్రొఫైల్ జాబ్‌లో ఉంటూ కూడా, సోషల్ మీడియాలో జగన్ కోసం సైకో రవీంద్రలా మారాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇప్పాల రవీంద్ర.. తనని, తన కుటుంబ సభ్యులని ఎంత దారుణంగా దూషించినా.. లోకేష్ మాత్రం అంత కఠినంగా వ్యవహరించలేదు. ఇప్పాల రవీంద్రని ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల నుండి తప్పించమని మాత్రమే కోరడంతో.. సిస్కో అదే పని చేసింది. అంటే ఒక్క ఏపీ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల ప్రాజెక్టుల్లో కానీ, లేదా నార్త్ ఇండియాలో సిస్కో చేపట్టే ప్రాజెక్టుల్లో కానీ… అతను పనిచేసుకునే అవకాశం ఇప్పటికీ ఉన్నట్లు అర్థమవుతోంది. అదే లోకేష్ ప్లేస్‌లో జగన్ ఉండి… ఇప్పాల రవీంద్ర స్థానంలో టీడీపీ కార్యకర్తో, అభిమానో ఉండి ఉంటే.. ఒక్క సిస్కో కంపెనీలోనే కాదు.. మరే కంపెనీలో కూడా జీవితంలో అతనికి ఉద్యోగం దొరక్కుండా.. జగన్ కక్షతీర్చుకునే వాడని నెటిజన్లు చర్చించుకుంటూ ఉండటం ఇక్కడ గమనార్హం.