Robinhood

Robinhood: అది దా సర్‌ప్రైజు అభిమానులకు షాకింగ్ సర్‌ప్రైజ్!

Robinhood: నితిన్ లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌తో రచ్చ స్టార్ట్ చేసింది. డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్‌తో హైలైట్ అయింది. ‘అది దా సర్‌ప్రైజు’ అంటూ సాగే ఈ సిజిలింగ్ నెంబర్‌లో కేతిక డ్యాన్స్, గ్లామర్‌తో థియేటర్స్‌లో సందడి చేసింది. కానీ ఈ పాట రిలీజ్ టైంలో ఓ హుక్ స్టెప్ వివాదంలో చిక్కుకుంది. మహిళలతో ఇలాంటి స్టెప్స్ ఏంటని నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఈ గొడవ మహిళా కమిషన్ దాకా చేరడంతో చిత్ర యూనిట్‌కు వార్నింగ్ కూడా జారీ అయింది.అయితే సినిమా రిలీజ్‌లో ఆ వివాదాస్పద స్టెప్ కనిపించకపోవడంతో.. మేకర్స్ దాన్ని కత్తిరించేశారని టాక్ నడుస్తోంది. ఈ కాంట్రవర్సీ మూవీకి ఎక్స్‌ట్రా బజ్ తెచ్చినా, టీమ్ సైలెంట్‌గా ఆ స్టెప్ ను ట్రిమ్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది. మొత్తంగా ‘రాబిన్‌హుడ్’ కామెడీ, గ్లామర్ డోస్‌తో ఆడియన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈ వివాదం సినిమా హిట్ టాక్‌ను ఆపలేదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nagarjuna: రికార్డులు బద్దలయ్యాయి.. కూలీ రిజల్ట్ పై నాగార్జున కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *