Telangana Cabinet Expantion:

Telangana Cabinet Expantion: మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధం.. ఇంకా అంద‌ని తుది జాబితా.. మారిన స‌మీక‌ర‌ణాలు

Telangana Cabinet Expantion: రాష్ట్రంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మైంది. దీనిపై అనేక ఊహాగానాలు ఎలా ఉన్నా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 3న త‌ప్ప‌కుండా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ మేర‌కే సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది. దీంతో ఈ రోజు (మార్చి 30) మ‌ధ్యాహ్నం రాజ్‌భ‌వ‌న్‌లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి క‌లువ‌నున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఆయ‌న‌తో చ‌ర్చించ‌నున్నారు.

Telangana Cabinet Expantion: ఇదిలా ఉండ‌గా, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉన్న‌ది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇంకా తుది జాబితా అంద‌నేలేదు. కానీ, ఏప్రిల్ 3న మాత్రం విస్త‌ర‌ణ‌కు ఏర్పాట్లు జ‌రుగుతూనే ఉన్నాయి. దీంతో ఆశావ‌హులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ద‌శ‌లో ఎవ‌రు మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారోన‌నే ఆస‌క్తి రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొన్న‌ది.

Telangana Cabinet Expantion: ఇటీవ‌ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్‌తో కాంగ్రెస్ అధిష్టానం చ‌ర్చ‌లు జ‌రిపింది. ఆ చ‌ర్చ‌ల్లో సామాజిక స‌మీక‌ర‌ణాలు, జిల్లాల ప్రాధాన్యాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. గ‌తంలో ఇచ్చిన హామీల విష‌యంపైనా వారు చ‌ర్చించారు. దీనిపై ఒక అంగీకారానికి వ‌చ్చిన అధిష్టానం తుది ఎంపిక‌పై ఇంకా క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్న‌ద‌ని స‌మాచారం. ఇదే త‌రుణంలో విజ‌య‌శాంతి పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది.

Telangana Cabinet Expantion: తొలుత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, వివేక్‌, వాకిటి శ్రీహ‌రి పేర్లు ఖారారు అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రొక‌రి ఎంపిక‌కు సుద‌ర్శ‌న్‌రెడ్డి, ప్రేమ్‌సాగ‌ర్‌రావు గురించి ఆలోచిస్తున్నార‌ని తెలిసింది. ఈ ద‌శ‌లో రెడ్డి ప్రాధాన్యం పెరుగుతుంత‌ని భావిస్తున్నారు. దీంతో పాటు హైద‌రాబాద్‌, రంగారెడ్డి ప్రాతినిథ్యంపైనా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిసింది. మైనార్టీ వ‌ర్గం నుంచి ఒక‌రికి ఇవ్వాల‌నే ప్రాధాన్యం మిగిలే ఉంటుంది.

Telangana Cabinet Expantion: ఒక ద‌శ‌లో ఆరు స్థానాలు ఖాళీలు ఉండ‌గా, నలుగురినే మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌ని తెలుస్తున్న‌ది. ఈ ద‌శ‌లో ఆశావ‌హులు పెరిగిన నేప‌థ్యంలో మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌కు ఉధ్వాస‌న ప‌లుకుతార‌ని, వారి స్థానంలో అదే సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేస్తార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే ఇప్ప‌ట్లో మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పులు చేయొద్దనే డిమాండ్ వ‌స్తున్న నేప‌థ్యంలో కేవ‌లం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కే ప‌రిమిత‌మైన‌ట్టు స‌మాచారం. ఏది ఏమైనా ఒక‌టి రెండు రోజుల్లోనే తుది జాబితా రాష్ట్ర పెద్ద‌ల‌కు చేరుతుంద‌ని భావిస్తున్నారు. దీంతో ఏప్రిల్ 3న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌న్న ఆస‌క్తి నెల‌కొన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *