RS Praveenkumar:

RS Praveenkumar: బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

RS Praveenkumar: బీఆర్ఎస్ రాష్ట్ర‌స్థాయి నేత‌, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై, సైబ‌ర్ సెక్యూరిటీ వింగ్‌పై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ నేత‌ల‌పైనే కేసులు న‌మోదు చేస్తున్నార‌ని, కాంగ్రెస్‌, బీజేపీ సోష‌ల్ మీడియా గ్రూప్‌ల‌లో అస‌భ్యక‌ర పోస్టులెన్నో వ‌స్తున్నా ఎందుకు వారిపై కేసులు న‌మోదు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. మార్చి 29న మీడియా స‌మావేశంలో ఆయ‌న ప‌లు అంశాల‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

RS Praveenkumar: దిలీప్ కొణ‌తం, రేవ‌తిలు సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై పోస్టులు చేశార‌ని సెక్ష‌న్ 111 ఎలా న‌మోదు చేస్తారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైబ‌ర్ సెక్యూరిటీ పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. ఎఫ్ఐఆర్‌లు గాంధీభ‌వ‌న్‌లో త‌యార‌వుతుంటే, ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి ఆదేశాలు వ‌స్తున్నాయ‌ని ఆరోపించారు. అస‌లు సోష‌ల్ మీడియా పోస్టులు ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. అలాంటి ఆర్గ‌నైజ్డ్ క్రైమ్‌కు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ పాల్ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు.

RS Praveenkumar: తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ అధికారులు ఎలా ప‌నిచేయాలో తాను చెప్తా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిత‌బోధ చేశారు. సైబ‌ర్ పెట్రోలింగ్ సెక్ర‌టేరియ‌ట్‌లో చేస్తేనే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. సెక్ర‌టేరియ‌ట్‌లోని అంద‌రు ఉన్న‌తాధికారుల‌కు ఈఆఫ్‌స్ అనే పోర్ట‌ల్ ఉంటుంద‌ని చెప్పారు. సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో బోర్డుకు నిజంగా ద‌మ్ము, ధైర్యం ఉంటే ఈఆఫీస్‌పై పెట్రోలింగ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. అక్క‌డ అవినీతి గురించి తెలుస్తుంద‌ని, ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన న్యాయం జ‌రుగుతుంద‌ని తేల్చి చెప్పారు. ఈ ఆఫీస్‌లో ఎక్క‌డ అవినీతి జ‌రుగుతున్న‌దో త‌న వ‌ద్ద స‌రైన ఆధారాలు ఉన్నాయ‌ని, సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు త‌న వ‌ద్ద‌కు వ‌స్తే వాటిని ఇస్తాన‌ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.

RS Praveenkumar: ట్విట్ట‌ర్‌లో ట్వీట్‌ను బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు రీపోస్టు చేస్తే సెక్ష‌న్ 67 ఐటీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నార‌ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంత‌రావు వ్య‌క్తంచేశారు. ఈ సెక్ష‌న్ 67 ఐటీ యాక్ట్ అనేది ఎవ‌రినైనా అనేది ఎవ‌రినైనా అశ్లీలంగా అగౌర‌వప‌రిస్తే న‌మోదు చేయాల‌ని చెప్పారు. కానీ, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌పై విచ్చ‌ల‌విడిగా ఈ యాక్ట్ పై కేసులు న‌మోదు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

RS Praveenkumar: తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో నిజంగా సైబ‌ర్ పెట్రోలింగ్ చేస్తున్నారా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌పై ఒక్క కేసు కూడా ఎందుకు న‌మోదు చేయలేద‌ని ప్ర‌శ్నించారు. సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరోకి కేవ‌లం బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్లే క‌న‌ప‌డుతున్నాయా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్ఫింగ్ ఉన్న ఫొటోల‌ను పోస్టు చేస్తున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నార‌ని ఆరోపించారు.

RS Praveenkumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. తెలంగాణ‌లో సీఎం రేవంత్‌రెడ్డే బాధితుడు, ఫిర్యాదుదారుడు, పోలీస్‌, ఇన్వెస్టిగేట‌ర్‌, క్లూస్ టీమ్‌, మెజిస్ట్రేట్‌, జైలు వార్డ‌ర్‌, సూప‌రింటెండెంట్‌.. అన్నీ ఆయ‌నే అని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో అంద‌రూ సంతోషంగా ఉన్నార‌ట‌.. ఒక్క రేవంత్‌రెడ్డినే బాధితుడ‌ట అని ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *