Annapurna Studios

Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోస్‌ పేరుతో మోసాల గాలం!

Annapurna Studios: తెలుగు సినీ జగత్తులో అన్నపూర్ణ స్టూడియోస్ అంటే తెలియని వారు ఎవరూ లేరు. అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా దూసుకెళ్తున్న ఈ స్టూడియో పేరును ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు రంగంలోకి దిగారు. ఉద్యోగాలు ఇస్తామని, నటీనటులు, టెక్నీషియన్‌లను తీసుకుంటామని చెబుతూ ఫేక్ ఆఫర్లతో సామాన్యులను ముంచే కుట్ర జరుగుతోంది. ఈ విషయంపై అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. “ఇలాంటి మాయమాటలను నమ్మితే జేబులు ఖాళీ అవుతాయి, జాగ్రత్త!” అని హెచ్చరించారు.”మా సంస్థ పేరుతో కొందరు దొంగ ఆఫర్లు ఇచ్చి డబ్బులు లాగేందుకు చూస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పటికీ ఆడిషన్ల కోసమో, ఏ ఇతర కారణం కోసమో ఒక్క పైసా కూడా వసూలు చేయదు” అని స్టూడియో వర్గాలు గట్టిగా చెప్పాయి. “ఎవరైనా తప్పుడు సంప్రదింపులు చేస్తే వెంటనే మా అధికారిక మెయిల్‌కు సమాచారం ఇవ్వండి, ఎట్టి పరిస్థితిలోనూ మోసపోవద్దు” అని ప్రజలకు సూచించాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *