Akhanda 2: బాలకృష్ణ లేటెస్ట్ గా డాకు మహారాజ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత బాలయ్య నుంచి రాబోతున్న అవైటెడ్ మూవీ “అఖండ 2 తాండవం”. బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా అఖండ 2 పై మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆడియెన్స్, అభిమానులు ఊహించని లెవెల్ లో ఉండే ఎలిమెంట్స్ ని బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా సినిమా కోసం బోయపాటి భారీ సెట్టింగ్స్ ని వేయించారట.అంతే కాకుండా అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉన్నట్టుగానే పరమ శివుని భారీ విగ్రహం, పవర్ఫుల్ సెట్టింగ్ ని రెడీ చేయించినట్టుగా తెలుస్తుంది. అఖండ 2 తాండవం మాత్రం ఊహించని రేంజిలో మామూలుగా ఉండదని సినీ వర్గాల్లో టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మిస్తున్నారు.
