Robinhood

Robinhood: ‘రాబిన్ హుడ్’ రైట్స్ కి సాలిడ్ డీల్ !

Robinhood: వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. మార్చి 28 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే, ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది.తాజాగా ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓటీటీ హక్కులు సాలిడ్ రైట్ కి అమ్ముడుపోయాయి. నితిన్ కెరీర్ లోనే భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొనుక్కున్నట్టు సమాచారం. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 (ZEE5) సొంతం చేసుకుంటే.. ‘జీ తెలుగు’ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ కూడా మంచి హిట్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *