Salman Khan

Salman Khan: రష్మిక కూతురితో కూడా ఆ పనిచేస్తా..?.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘సికందర్‌’. ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సినిమా బృందం ట్రైలర్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఆ వేడుకలో సల్మాన్‌ ఖాన్‌ -రష్మిక వయసు తేడా గురించి సల్మాన్‌ ఖాన్ కి ఓ ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ భాయ్ మాట్లాడుతూ.. “మా వయసు గురించి మీకెందుకు ? నాకు, రష్మికకి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు. అయినా, హీరోయిన్‌కు గానీ, ఆమె తండ్రికి గానీ లేని సమస్య మీకెందుకు ? ఒకవేళ భవిష్యత్తులో రష్మికకు పెళ్లై పాప పుడితే, ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది. అప్పుడు ఆ పాపతో కూడా నేను కలిసి నటిస్తా” అని సల్మాన్ ఖాన్ షాకింగ్ సమాధానమివ్వడం విశేషం. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘సికందర్‌’ మూవీ ట్రైలర్‌ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. దీంతో సల్మాన్ కచ్చితంగా హిట్ అందుకోవడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *