Students Protest: నిజాం కళాశాలలో బాయ్స్ హాస్టల్ విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. హాస్టల్ నిర్వహణలో లోపాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కనీసం పరిశుభ్రతా చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటైజర్ లోపాలున్నాయని ఆరోపణలు చేశారు. ఈ కారణంగా మెస్‌లో కూర్చొని తాము తినలేకపోతున్నామని ఏకంగా ఆందోళనకు దిగారు.
Students Protest: హాస్టల్ మెస్‌లో ఉండే చెత్తకుప్పల మధ్య ఉండి తాము తినలేకపోతున్నామని పేర్కొన్న విద్యార్థులు ఏకంగా హాస్టల్ బయట బహిరంగ ప్రదేశంలో వరుసగా కూర్చొని భోజనం చేసి నిరసనకు దిగారు. హాస్టల్ వర్కర్లకు సరైన సమయంలో జీతాలు చెల్లించకుండా వాళ్లని కాలేజీ యాజమాన్యం ఇబ్బందులు పెడుతుందని, అందుకే పరిశుభ్రతా చర్యలు చేపట్టబోమని వారు నిరాకరించడంతో తాము ఇలా నిరసనకు దిగామని విద్యార్థులు తెలిపారు.