Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున పొలం పనులకు వెళ్లి వస్తుండగా.. దారి కాచిన దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘోరమైన సంఘటన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని నారాయణపురంలో చోటు చేసుకుంది.
ఆత్మకూరు మండలం, లింగాపూర్‌కు చెందిన రైతు అయిన సుధాకర్ రెడ్డి.. నారాయణపురంలో ఉన్న తన పొలానికి వెళ్లి.. పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా దారికాచిన దుండగులు కత్తులతో దారుణంగా దాడి చేశారు. దుండగులు తలపై నరకడంతో సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా ఆధిపత్యపోరే సుధాకర్ రెడ్డి హత్యకు కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్.. సంఘటన ప్రదేశంలో క్లూస్ సేకరించారు. అలాగే స్థానికుల నుంచి సమాచారం సేకరించి.. సుధాకర్ రెడ్డి హత్య పై దర్యాప్తు చేపట్టారు.