Robinhood

Robinhood: రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తున్న రాబిన్ హుడ్!

Robinhood: నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మార్చి 28 నుంచి ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమా ఇప్పుడు ఓ ఘనత అందుకుంది. ఈ మార్చి నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘రాబిన్‌హుడ్’ టాప్ ప్లేస్‌లో నిలిచినట్లు ఐఎండిబి సంస్థ పేర్కొంది. తెలుగులో మార్చి నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ‘రాబిన్‌హుడ్’ నిలిచింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *