Adulterated Ghee

Adulterated Ghee: అసలు దొంగలు తప్పించుకుంటున్నారా?

Adulterated Ghee: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెయ్యి కల్తీ కేసు నెల్లూరులోని అవినీతి నిరోధక శాఖ కోర్టుకు బదిలీ అయింది. సంబంధిత రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించనున్న సిట్ అధికారులు, టీటీడీకి చెందిన ఇద్దరు ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, అదుపులో తీసుకుని విచారించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తు ఊపందుకోనున్నట్లు అంతా భావిస్తున్నారు కానీ.. అసలు లబ్ధిదారులైన పైస్థాయి అధికారులు తప్పించుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ కేసు దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చింది? ఏం జరగబోతోంది? లెట్స్‌ వాచ్‌ ద స్టోరీ.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెయ్యి కల్తీ కేసు నెల్లూరులోని అవినీతి నిరోధక శాఖ కోర్టుకు బదిలీ అయింది. ఆ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విజ్ఞప్తి మేరకు తిరుపతిలోని 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. సంబంధిత రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించనున్న సిట్ అధికారులు, టీటీడీకి చెందిన ఓ ఇద్దరు ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, అదుపులో తీసుకుని విచారించనున్నట్టు తెలుస్తోంది.

టీటీడీ పరిధిలోని దేవాలయాల ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనే వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల సిట్ గత ఏడాది నవంబర్ 22 నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో నెయ్యి సరఫరాలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సరఫరాదారులను అరెస్టు చేసి సిట్ అధికారులు రెండు విడతలుగా కస్టడీకి తీసుకుని విచారించిన విషయం కూడా విదితమే. తాజాగా సిట్ బృందం దాఖలు చేసిన పిటిషన్‌లో కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Mahaa Vamsi: వివేకా ని చంపింది అవినాష్ రెడ్డి..నిజం ఒప్పుకున్నా సునీల్ యాదవ్

మరోవైపు టీటీడీ మార్కెటింగ్ విభాగంలో పని చేసే ఇద్దరు… ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులపై అవినీతి నిరోధకచట్టం సెక్షన్లు 7, 8 కింద అదుపులో తీసుకుని విచారించడానికి అనుమతి కూడా కోరారు. ఈ క్రమంలో స్పందించిన తిరుపతి 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి మొత్తం కేసును నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీచేశారు. ఆ మేరకు సిట్ అధికారులు స్థానిక కోర్టు ఆధీనంలోని కేసు సంబంధిత డాక్యుమెంట్లను, సమర్పించిన సాక్షాధారాల రికార్డులను తిరిగి తీసుకున్నారు. వాటిని నెల్లూరు ఏసీబీ కోర్టుకు సమర్పించాక కేసు విచారణ ప్రక్రియ నెల్లూరు ఏసీబీ కోర్టునుంచే మొదలవుతుందని సంబంధిత అధికార వర్గాలు చెప్తున్నాయి.

ALSO READ  Mohan Babu: మోహన్ బాబు ఇలాకాలో మరో వివాదం.. వీడియోతో సహా దొరికిన సిబ్బంది

మొత్తం మీద తాజా పరిణామాలతో కేసు విచారణ నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ కావడంతో పాటు టీటీడీలో పనిచేసే ఇద్దరు అధికారులను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించడంతో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తు ఊపందుకోనున్నట్టు అంతా భావిస్తున్నారు. ఈ పరిణామం సహజంగానే టీటీడీ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తించడంతో పాటు సంచలన చర్చ జరుగుతోంది. అయితే కల్తీ వ్యవహారంలో అసలు లబ్ధిదారుల్ని వదిలేస్తున్నారా? అన్న అనుమానాలు అంతర్గత వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా నాడు ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీలో చక్రం తిప్పిన అధికారులు చల్లగా జారుకుంటున్నారన్న వాదన వినబడుతోంది. పైస్థాయి అధికారుల్ని టచ్‌ చేయకుండా.. మార్కెంటింగ్‌ విభాగంలో పనిచేసే ఓ ఇద్దరు ఉద్యోగుల్ని బలిపశువుల్ని చేయడం ద్వారా.. కేసు ముగించబోతున్నారా? అన్న ప్రశ్నల్ని పలువురు లేవదీస్తున్నారు. కల్తీ జరిగిందని టెస్టుల్లో తేలిన నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపాక కూడా.. తిరిగి టీటీడీకి రప్పించడంలో ఎవరి పాత్ర ఉందనేది తేల్చితే.. పలువరు టీటీడీ ఉన్నతాధికారుల పేర్లు వెలుగుచూసే అవకాశం ఉంది. మరి సిట్‌ ఆ ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *