Sonia Akula : పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ సోనియా

బిగ్ బాస్ తెలుగు 8తో ఫుల్ పాపులర్ అయిన సెలబ్రేటీ సోనియా ఆకుల.. ఇటీవలే షో నుండి ఎలిమినేట్ అయిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో సోనియా తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతనిని వివాహం చేసుకుంటానని వెల్లడించింది. ఆమె బంధానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. రెండేళ్ల పాటు ఆమె తన లవర్ యష్ తో డేటింగ్ లో ఉన్న సోనియా అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి పెళ్లి హైదరాబాద్‌లో జరగనుంది. వాస్తవానికి వీరి పెళ్లి ఎప్పుడో జరగాల్సి ఉంది కానీ.. బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు సోనియా తన పెళ్లిని వాయిదా వేసుకుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారని సోనియా వెల్లడించింది. సోనియాకు కాబోయే భర్త యష్ విషయానికి వస్తే.. అతనికి స్వయంగా ఫ్లై హై అనే టూరిజం సంస్థ ఉంది. అలాగే అబ్రాడ్ కి వెళ్లే స్టూడెంట్స్ కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యష్ సోనియాతో ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘సోనియా నేను రెండు, మూడేళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం. మా పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. మా వివాహానికి ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకున్నారు. బిగ్ బాస్ కి వెళ్లేముందే వివాహం చేసుకోవాలని భావించాం. అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకోకూడదని సోనియా వెళ్లింది. డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాం’ అని యష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ అభిమానులు, నెటిజన్లు సోనియా, యష్ లకు ముందుగానే శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *