Bihar

Bihar: మేకులు పొడిచిన మృతదేహం లభ్యం..

Bihar: బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ పాదాల్లో 10 మేకులు పొడిచిన మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నలంద జిల్లాలో పాదాల్లో 10 మేకులు గుచ్చబడిని స్థితిలో మహిళ శవం లభ్యమైంది. ఈ సంఘటన జిల్లాలోని చండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం మేరకు, పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. ఆమె బహదూర్‌పూర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఎలా మరణించిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు మహిళపై అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: Mutton Curry: కూర వండలేదని భార్యను చంపిన భర్త..

Bihar: ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం సొంత జిల్లాలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మహిళలపై నేరాల్లో బీహార్ అగ్రస్థానంలో ఉందని, దీనికి సీఎం సిగ్గుపడాలని, ఈ హృదయవిదారక ఘటనపై ఎవరైనా చలించకపోతే, వారు మనిషే కాదని ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.

నిందితులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అయితే, స్థానికులు ఇది క్షుద్రపూజ ఏమో అని అనుమానిస్తున్నారు. మరణించిన మహిళ వయసు 26 ఏళ్లు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం మహిళ గుర్తింపుని నిర్ధారించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మంత్రి విద్య కోసం ఇలా మేకులు ఉపయోగిస్తారని, ఇది చేతబడి కారణంగా హత్య జరిగి ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. ఆ స్త్రీని బలి ఇచ్చి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: కుప్ప‌కూలిన పారాగ్లైడర్‌.. యువ‌కుడైన టూరిస్టు దుర్మ‌ర‌ణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *