Andhra Pradesh

Andhra Pradesh: చిన్నారుల తప్పుహెడ్ మాస్టర్ గుంజీలు..మనసున్న మాస్టారుకు లోకేష్ ఫిదా

Andhra Pradesh: ఎంత చెప్పినా హోం వర్క్ చేయట్లేదు.. బతి మాలినా , బెదిరించినా..చెయ్యరు.. ఫిజికల్ పనిష్ మెంట్ ఇవ్వడం సాధ్యం కాదు.. పొర పాటు న కాస్త దెబ్బ వేస్తే…తరువాత టీచర్ మీదకే తప్పు నెట్టే వ్యవస్థ లో పిల్లల వైఖరితో విసిగి పోయిన నంద బలగ హై స్కూల్ కి చెందిన ఇంగ్లీష్ టీచర్ విజయ మోహన్ రావు వినూత్నంగా పనీష్ మెంట్ ఇస్తున్నారు..
ఇచ్చిన హోం వర్క్ చెయ్యక పోవడం, తరచూ అకారణంగా బడికి రాక పోవడం, ఎక్కువగా అల్లరి చెయ్యడం చేసే విద్యార్థులలో మార్పు రావాలని..బెత్తంతో తనను తానే మోచేయి పై.. కొట్టుకుంటారు….
ఇలా చేయడం కష్టంగా ఉన్నపటికీ… వారిలో మార్పు కోసమే గత నాలుగు నెలలుగా ఇలా బెత్తం దెబ్బలు తింటున్న ట్లు తెలిపారు. తమకు బదులు ఉపాధ్యాయుడు దెబ్బలు తినడం చూసి విద్యార్థుల్లో మానసిక పరివర్తన కలిగే అవకాశం ఉందని అన్నారు..కాగా దీనివల్ల విద్యార్థుల ప్రవర్తనలో మంచి మార్పులు వస్తున్నాయని తెలిపారు.

Andhra Pradesh: ఈ సంఘటనపై ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు .  టీచర్ తీరును ఆయన మెచ్చుకున్నారు .  పిల్లల్లో పరివర్తన తీసుకురావడం కోసం ఆ టీచర్ చేస్తున్న పనిని మెచ్చుకున్నారు .  “హెడ్మాస్ట‌రు గారూ! అంతా క‌లిసి ప‌నిచేసి, ప్రోత్సాహం అందిస్తే మ‌న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ పిల్ల‌లు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించ‌కుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ‌క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ ఆలోచ‌న బాగుంది. అభినంద‌న‌లు. అంతా క‌లిసి విద్యాప్ర‌మాణాలు పెంచుదాం. పిల్ల‌ల విద్య‌, శారీర‌క‌, మాన‌సిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేద్దాం.” అంటూ ఆయన తన X పోస్ట్ లో పేర్కొన్నారు.

ఈ విషయంపై మహావంశీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక్కడ

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *