Haryana Municipal Elections: హర్యానాలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలో బిజెపి అధికారంలో ఉంది. గత 2 నెలల్లో ఇక్కడ 7 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహ్తక్, కర్నాల్, యమునా నగర్, గురుగ్రామ్, మనేసర్ స్థానాలలో ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా అంబాలా, సోనిపట్ మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవికి ఉప ఎన్నికలు జరిగాయి. తరువాత ఈ నెల 9వ తేదీన పానిపట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో మొత్తం 41 శాతం ఓట్లు నమోదయ్యాయి. వీరిలో 26 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు 12వ తేదీన జరిగింది. వీటిలో, పరిషత్, హిసార్, గురుగ్రామ్, యమునా నగర్, కర్నాల్ సహా 10 మునిసిపల్ కార్పొరేషన్లలో తొమ్మిదింటిలో బిజెపి అఖండ విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: Crime News: 40 ఏళ్లనాటి దళితుల ఊచకోత.. ఇప్పుడు ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు!
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హుడాకు బలమైన కోటగా పరిగణించే రోహ్‌తక్‌ను కూడా బిజెపి కైవసం చేసుకుంది.
మనేసర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బిజెపి తిరుగుబాటు నాయకుడు డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ గెలిచారు. 10 మేయర్ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదు.గత ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం, స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీ తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంది.

