TGPSC: టీజీపీఎస్సీ నియామక పరీక్షలపై సర్కారులో కదలిక వచ్చింది. గ్రూప్-1, 2, 3 పరీక్షలు రాసిన అభ్యర్థులు నెలలుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా జీఆర్ఎల్ జాబితాలు ప్రకటించకుండా ఇంతకాలం జాప్యం చేస్తూ వచ్చింది. ఈ మూడింటిలో గ్రూప్-3 పరీక్షపై ఆన్సర్ కీని ప్రకటించింది. గ్రూప్ 2పై ఇంత వరకు ప్రకటించలేదు.
TGPSC: ఆర్డర్ ప్రకారం భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే ఇంత కాలం ఫలితాలు వెల్లడించలేదని తెలుస్తున్నది. ఈ మూడింటిలో గ్రూప్-3 పరీక్షలు ముందుగానే జరిగినా, ఆ తర్వాతే గ్రూప్-1, 2 పరీక్షలు జరిగాయి. ముందుగా గ్రూప్-1 నియామకాలు పూర్తయ్యాక, గ్రూప్-2 చేపట్టాలని, ఆ తర్వాతే గ్రూప్-3 నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్సీ కమిషన్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. దీనిద్వారా గ్రూప్-1లో రానివారు ఆ తర్వాత పోస్టుల్లో చేరుతారు. ఒకవేళ గ్రూప్-3 ముందుగా చేపడితే, ఆ తర్వాత గ్రూప్-1లో ఎంపికైతే మళ్లీ గ్రూప్-3లో, గ్రూప్-2లో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉటుందని భావిస్తున్నట్టు తెలిసింది.
TGPSC: ఈ మేరకు టీజీపీఎస్సీ ఈ మూడు నియామక పరీక్షల ఫలితాల షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. ముందుగా అంటే ఈ నెల (మార్చి 10న గ్రూప్-1 ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రకటించింది. ఈ గ్రూప్-1 నియామకం ద్వారా 563 పోస్టులను భర్తీ చేయనున్నది. ఇప్పటికే జవాబుల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటించేందుకు టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగుతున్నది.
TGPSC: ఈ నెల 10న ఫలితాల విడుదల అనంతరం ఆయా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. ఈ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21,-93 మంది హాజరయ్యారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సుమారు 38 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదే విధంగా ఈ నెల 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా, ఈ నెల 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నది. ఈ రెండు నియామక పరీక్షలపై అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలువనున్నది. ఆ తర్వాత తుది జాబితాను ఎంపిక చేయనున్నది.