Bottle Gourd

Bottle Gourd: సొరకాయను ఈ కూరగాయలతో కలిపి తినొద్దు.. ఒకవేళ తింటే..?

Bottle Gourd: ఆరోగ్యంగా ఉండడానికి కూరగాయలు తినడం చాలా ముఖ్యం. వివిధ రకాల కూరగాయలు శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్లను అందిస్తాయి. అలాంటి కూరగాయలలో సోర ఒకటి. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా సొట్లకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా సోరకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అదనంగా అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలను సొరకాయతో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం..

సొరకాయతో కాలీఫ్లవర్ తినడం మంచిది కాదు. ఈ రెండు కూరగాయలను కలిపి తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఉబ్బసం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని కలిపి తినకపోవడమే మంచిది.

Also Read: Hair Loss: జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా..? అయితే బీట్‌రూట్ తినండి

సొరకాయతో కాకరకాయ తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ రెండిటిని కలిపి తినడం వల్ల శరీరం విషపూరితం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కలిపి తినకండి.

పాలతో సొరకాయ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. పాలు, సొరకాయ కలిపి తీసుకుంటే శరీరంలో వివిధ రసాయన ప్రతిచర్యలు జరుగుతాయి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది కాబట్టి. ఈ రెండింటినీ ఏ వంటలోనూ కలపవద్దు.

బీట్‌రూట్‌తో పాటు సొరకాయ తినడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు వస్తాయి. కాబట్టి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రెండు కూరగాయలను కలిపి తినవద్దు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rohit Sharma: మరో అరుదైన రికార్డు ముంగిట రోహిత్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *